
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 జూలై, 2025.
జల వివాదాల నిపుణుల కమిటీపై అఖిలపక్ష సమావేశం వేయాలి
బనకచర్లపై బుధవారం ఢల్లీిలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర ప్రభుత్వ శల్య సారధ్యంతో జలవివాదాలను మరింత జటిలం చేసే విధంగా వుందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన సమావేశం బనకచర్ల ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించకపోగా గోదావరి, కృష్ణా నదీ జలాల వివాదాల తేనెతుట్టేను కదల్చే విధంగా వుందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిరది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా ఏమి జరిగినా అది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తుంది. ఈ కమిటీ ఆ నిర్ణయానికి లోబడి వ్యవహరించాలి. తక్షణం అఖిలపక్ష సమావేశం వేసి ఢల్లీిలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశ వివరాలను, నిపుణుల కమిటీ విధివిధానాలను ప్రజలకు స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
82 వేల కోట్ల ప్రతిపాదనలతో బనకచర్ల ప్రాజెక్టు 3 సంవత్సరాలలో నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున హడావుడి చేసింది. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వ జోక్యం ద్వారా పరిష్కరించుకోనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కాని ఈ సమావేశంలో అదికూడా చర్చకు రాలేదు. కృష్ణా జలాల విషయంపై తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ నీటిలో తనకు సగ భాగం కావాలని అది డిమాండ్ చేస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి పేరుతో కనిష్ట నీటిమట్టానికంటే దిగువనున్న నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం తోడేస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కూడా విమర్శించింది.
గోదావరి వరద జలాలను మళ్లించి రాయలసీమలో సాగునీటి వనరులను పెంచడంతో పాటు, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు పోలవరం` బనకచర్ల ప్రాజెక్టు నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. బనకచర్ల భారమని దానికంటే ముందు పెండిరగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా బనకచర్ల ప్రాజెక్టు అసాధ్యమని తేల్చింది. బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఆసరా చేసుకొని కేంద్రం కృష్ణా, గోదావరి జలాల సమస్యను జఠిలం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాల్సిన సమస్యను కేంద్ర ప్రభుత్వ దుర్బుద్దితో జఠిలం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తలూపి రావడం శోచనీయం. ఇప్పటికైనా వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టుల సమస్యలపై దృష్టి పెట్టి పూర్తి చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
