
బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వా మి రాహుల్ గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2001వ సంవత్సరంలో అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ వద్ద 1.60 లక్షల డాలర్ల నగదు, వైట్ పౌడర్ ఉండటంతో అతన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అధికారులు పట్టుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయికి ఫోన్ చేయగా, వాజపేయి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్కు ఫోన్ చేశారని, దాంతో ఎఫ్బిఐ అధికారులు రాహుల్ గాంధీని వదిలివేశారని సుబ్రహ్మణ్య స్వామిని ఉటంకిస్తూ ఒక హిందీ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.