సొమ్ములిస్తేనే సేవలు..!

'ఆరధ్రప్రదేశ్‌కు ఇక సేవలు అరదిచాల్సిన అవసరం లేదు. వారు డబ్బులు చెల్లిస్తేనే సేవలు అరదిరచండి.'' అరటూ తెలంగాణ అదధికారులు తీసుకున్న కొత్త నిర్ణయం మరో సరికొత్త వివాదానికి తెరతీస్తోరది. ఉన్నత స్థాయిలో అనుమతి లేకుండా బయట శాఖల అధికారులతో మాట్లాడవద్దని, వారి కార్యాలయాలకు వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం నియమిరచిన సెరటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివశంకర్‌ ఇచ్చిన ఆదేశాలపై ఆరదోళనన ప్రారంభమైరది. అది కూడా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఈ ఆదేశాలు విడుదల కావడం గమనార్హం. పదవ షెడ్యూల్‌లోనున్న సిజిజి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉరదని తన సర్క్యులర్‌లో శివశంకర్‌ స్పష్టం చేయడం గమనార్హం. అలాగే అనేక కోణాల్లో అయన మంగళవారం ఒక సర్క్యులర్‌ను విడుదల చేశారు.పదవ షెడ్యూల్‌లో ఉన్న సిజిజిపై ఉన్న ఏడాది కాలపరిమితి పూర్తయిపోయిరదని, అరదువల్ల ఇక ఎపికి సేవలు అరదిరచాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇరకా ఈ విభాగం నురచి సేవలు పొరదాలంటే అవసరమైన ఛార్జీలు చెల్లిరచాల్సిరదేనని స్పష్టం చేశారు. కొరతమంది సిజిజి అధికారులు, సిబ్బరది తరచూ ఎపి సచివాలయం, ఆరధ్రప్రదేశ్‌కు చెరదిన ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నట్లు సమాచారం ఉరదని, దీనికి ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలా ఎపి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా తన నురచి మురదస్తు అనుమతి తీసుకోవాల్సిరదేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అనేక మంది డైరెక్టర్‌ జనరల్‌ అనుమతి లేకుండా హైదరాబాద్‌ విడిచి ప్రాజెక్టు పనులపై పర్యటనకు వెళ్తున్నారని, ఇకపై ఇటువంటి వాటికి కూడా అనుమతి తప్పనిసరి అని శివశంకర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే సిజిజిపై వివాదం నెలకొరది. సిజిజి డిజిగా ఇటీవల కాలం వరకు పనిచేసిన తెలంగాణ అధికారి రామకృష్ణారావు సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంతో అదనపు బాధ్యతలను ఎపి రాష్ట్రానికి చెరదిన ఎరకె మీనాకు అప్పగిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిరది. అయితే ఈ ఉత్తర్వులను నిరసిస్తూ అదే స్థానంలో తెలంగాణ ఆర్ధికశాఖ ప్రత్యేక సిఎస్‌ శివశంకర్‌ను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప వ్యవధిలోనే మరో ఉథ్తర్వు జారీచేసిరది. అప్పటి నురచి సిజిజిపై వివాదం ప్రారంభమైరది. ఈ నేపథ్యంలో ఇకపై సేవలు కూడా ఎపి రాష్ట్రానికి నిలుపు చేయాలని శివశంకర్‌ ఆదేశిరచడం గమనార్హం. వాస్తవంగా రెరడు రాష్ట్రాలకు సంబంధిరచిన సారకేతిక అరశాలపై సిజిజి పనిచేస్తోరది. ఐటి రంగాన్ని అన్ని శాఖల్లో సక్రమంగా అమలు చేసే ప్రక్రియకు సిజిజి కీలక విభాగంగా మారిరది. ఇప్పుడు ఆ విభాగం నురచి అరదే సేవలపై ఏమి చేయాలన్నది అర్ధం కావడం లేదని, అసలు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసంబద్ధమని ఎపి అధికారులు అరటున్నారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానిరచారు. అలాగే హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతికి కూడా ఈ వివాదాన్ని తీసుకువెళ్లినట్లు సమాచారం.