భారత్‌ 100% హిందువులదే..

హిందూ తీవ్రవాదంపై జరుగు తున్న చర్చ పట్ల శివసేన చాలా దూకుడుగా స్పం దించింది. భారతదేశం పూర్తిగా వంద శాతమూ హిందూ దేశమేనని స్పష్టం చేసింది. తమ సొంత దేశంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి హిందు వులకు ఎలాంటి కారణం లేదని పేర్కొంది. హిం దూ తీవ్రవాదం అనే పదాన్ని కనిపెట్టడం ద్వారా తీవ్రవాదంపై పోరు సల్పడంలో కాంగ్రెస్‌ బలహీ నమై పోయిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ విమర్శించిన కొద్దిరోజల తర్వాత ఈ ప్రకటన వెలు వడింది. 'తీవ్రవాదానికి కాషాయరంగు పులిమి, దానిపై రాజకీయాలకు పాల్ప డడం మోసపూ రితమైన, స్వార్ధపూరితమైన చర్య' అని సేన తన సంపాదకీయం సామ్నాలో పేర్కొంది. హిందువు లను తీవ్రవాదులగా పేర్కొంటూ పాకిస్తాన్‌ పాల్ప డే తీవ్రవాదంపై ముసుగు వేయడం ద్వారా మన సొంత దేశం పట్లనే నిజాయితీ లేకుండా వ్యవహరి స్తున్నారని ఆ సంపాదకీయం పేర్కొంది.