District News

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్య దర్శి అండ్య మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ప్రయి వేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ శాంతినగర్లో సోమవారం కెవిపిఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు దళిత, గిరిజన, మైనార్టీ ప్రజల సమస్యలు పూర్తిగా విస్మరించా యని విమర్శించారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు పాల్గొన్నారు.

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే, అవసరమైనంత మేర...

భోగాపురంలో టిడిపి చేస్తున్న బలప్రయోగాన్ని అందరూ ఖండించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని, జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే లాఠీచార్జ్ చేసి చావగొడుతున్నారన్నారు. పెద్ద ఎత్తున్న బలగాలను దించి రైతులను భయబ్రాంతులను గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లక్షలాది ఎకరాలు తీసుకుంటే తీరని అన్యాయం జరుగుతుందని, దీనిని ఖండించాలని మధు పేర్కొన్నారు.

విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. 

సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు. చిన్నతనం నుంచి తమకు నచ్చిన పుస్తకాలను చదవనిస్తే, పిల్లలకు పుస్తక పఠనం అల వాటుగా మారుతుందని చెప్పారు. పాఠకుల సంఖ్య ఎప్పటికప్పుడు...

ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మున్సిపల్‌ ఉద్యోగులకు అందజేస్తామని హామీ ఇచ్చిన రూ. 11 వేల జీతాలకు జీవోను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన 11 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం విజయ వాడలో శుక్రవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభి ంచిన గఫూర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ అని పదే పదే చెప్పే చంద్ర బాబు వీధులను, డ్రైనేజీలను శుభ్రపరిచే వారికి పెంచిన వేతనాలు అందించకపో వడం సిగ్గు చేటన్నారు. ఇంజనీరింగ్‌, ఆఫీసు స్టాఫ్‌ స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ ఉద్యోగులకు జీతా లు...

రాజధాని నిర్మాణ విషయంలో రహస్య ఒప్పందాలవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిపిఎం సిఆర్‌డిఏ ఏరియా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు విమర్శించారు.  రాజధాని విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అనుమానాలకు ఊతమిస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత కరువైందని తెలిపారు. పరోక్ష పద్ధతిలో భూములను విదేశీ కంపెనీలకు కట్ట బెట్టాలనే కుట్ర సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకంగా వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక అనంతరం నిర్మాణ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పిన ప్రభుత్వం నేరుగా సింగపూర్‌ ప్రభుత్వంతో ఎలా చర్చలు జరుపుతుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాలను భాగస్వామ్య పద్ధతిలో...

తెలంగాణలో చలో అసెంబ్లీ సందర్భంగా ఏపీ సరిహదుల్లో ఉన్న సీపీఎం నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. పీఎస్ కు హాజరు కావాలని జగ్గయ్య పేట ఎస్ఐ సీపీఎం నేతలను ఆదేశించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల తరపున పోరాడే సీపీఎం నేతలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు పేర్కొన్నారు.

 తెలుగు భాషా వికాసానికి గుర్రం జాషువా విశేష కృషి చేశారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ కొనియాడారు. తన అద్వితీయ కవిత్వం ద్వారా ప్రజలందరి ఐక్యతకు తెలుగు కవితా సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకు న్నారన్నారు. కెవిపిఎస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 120వ జయంతి విజయవాడలోని సిఐటియు నగ ర కార్యాలయంలో సోమవారం జరిగింది. తొలుత జాషువా చిత్రపటానికి గఫూర్‌ పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు అధ్యక్ష తన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ, అభ్యుదయ భావాలతో సాగిన ఆయన రచనలు నేటితరానికి ఆదర్శప్రా యమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమా మహేశ్వరావు మాట్లాడుతూ, పద్యరచన, కవితా రచనల ద్వారా జాషువా...

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ "భూబ్యాంక్ బండారం..కార్పోరేట్లకు పందేరం" అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమక్ష్యంలో విడుదలచేసారు.

Pages