District News

పేదల పొట్టగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గురువారం కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగిన కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి నిమగమయ్యారని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దివిసీమలోని 15 వేల మత్స్యకార కుటుంబాలకు చెందిన దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓవైపు పేదల భూములను లాక్కుంటూ మరోవైపు సముద్ర తీరాల్లో విదేశీ సంస్థలతో ఫ్యాక్టరీలు...

పేద‌ల సాగులో ఉన్న అట‌వీ భూముల‌ను స్వా‌ధీనం చేసుకోవ‌ద్ద‌ని కోరుతూ సిపిఎం ఆధ్వ‌ర్యంలో కృష్ణా జిల్లా మైల‌వ‌రం జాతీయ ర‌హ‌దారిపై రాస్తా‌రోక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ను పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం పోలీసులు మైల‌వ‌రం పోలీసు స్టే‌ష‌న్ కు త‌ర‌లించారు. పోలీసుల‌కు పేద‌ల‌కు మ‌ద్య వాగ్వా‌దం జ‌రిగింది. పోలీసులు విచ‌క్ష‌ణ ర‌హితంగా వారిని ఈడ్చి పారేశారు.  

కృష్ణాజిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మధు మాట్లాడుతుండగా పోలీసులు మైక్‌ లాక్కొని...ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు, సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీభూముల్లో సాగును అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని...

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడున్నర వేల మంది కార్మికులను అరెస్టు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జీలు జరిపారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుసహా పలువురు వామపక్ష నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. పిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబలేసు సహా వేలాది మందిని అరెస్టు చేశారు. విశాఖలో 2,500 మందినీ, రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద మరో వెయ్యి మందినీ అరెస్టు చేశారు. 

పార్లమెంటు దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే ఇది పార్లమెంటు వద్ద జరిగిన మాక్‌డ్రిల్‌ అని తెలిసింది. ఒకవైపు పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌ జిల్లా దినానగర్‌లో ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశ సరిహద్దులతో పాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం నాయకులు మునిసిపల్ కార్మికులతో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పిడిగుద్దులు.. బలప్రయోగం చేయడంతో సీపీఎం నేత బాబురావు,...

విద్యార్థులు, యువత తమలోని జ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి తోడ్పడాలని రాజ్యసభ సభ్యుడు, బెనారస్‌ యూనివర్సిటీ చాన్సలర్‌, పద్మవిభూషణ్‌ కరణ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం శామీర్‌పేటలోని బిట్స్‌ క్యాంపస్‌లో వైస్‌ చాన్సలర్‌ బిజేంద్రనాథ్‌ జైన్‌ ఆధ్వర్యంలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరణ్‌సింగ్‌ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సమాచారం ఉందని, అందులో నుంచి జ్ఞానాన్ని వెలికితీయాలని.. ఇందుకు విద్యార్థులు, యువత చైతన్య స్ఫూర్తితో ముందడుగేయాలని కరణ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ఈ తరం యువత ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించుకునే విద్యను నేర్చుకోవాలని సూచించారు. కొత్త విషయాలు నేర్చుకునేలా మనుసును సిద్ధం...

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీబాబు అయ్యారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు(ఒడిసి) నుంచి ప్రారంభమైన రాహుల్‌ రైతు భరోసా పాదయాత్ర కొండకమర్ల గ్రామం వద్ద ముగిసింది. 1979లో ఒడిసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ పాల్గొన్న వేదిక వద్దనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలో రాహుల్‌ వేపమొక్కను నాటారు. గ్రామశివారులో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో సమావేశ మయ్యారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. 47 మంది బాధితుల కుటుంబాలకు రూ....

Pages