District News

హిందూ, ముస్లిములు సఖ్యతగా మెలగాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ మతం పేరుతో పబ్బం గడుపుకుంటోందని మధు విమర్శించారు. మతసామరస్యంపై ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ జరిగింది. 

ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. అందుకు అనుకూలంగానే అక్టోబర్‌ 14న జిఓ నెంబర్‌ 633ను విడుదల చేసిందని ప్రజా ఆరోగ్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. 

 బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్‌ సిపిఎం ఎమ్మెల్యే మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగామి విమర్శించారు.మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామి మాట్లాడుతూ, ఎన్నో కలలు కన్న స్వాతంత్ర భారతదేశం నేడు లేదని ,మత ఛాందసవాదం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించేందుకే ప్రభుత్వం అసహనం పెరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. వాస్తవానికి ప్రజలు ఎంతో సహనంగా ఉన్నారని తెలిపారు.  బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌స్‌ అధికారం కోసమే తాపత్రయం...

చెన్నై వరద బాధితుల సహాయార్థం విజయవాడలో సీపీఎం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య, సిహెచ్ .బాబురావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ పలువురు సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.. తాగేందుకు మంచినీళ్లు కూడా లేని చెన్నై వాసులకు ప్రతీ ఒక్కరు మానవతా హృదయంతో సహాయం చేయాలని కోరారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.

గ్గయ్యపేటరూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్నారని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సోమోజు నాగమణి విమర్శించారు. ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ మండలంలోని షేర్‌మహమ్మద్‌పేట అడ్డరోడ్డులో  ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను  సిపిఎం డివిజన్‌ నాయకులు ఘంటా నాంచారయ్య ప్రారంభించారు. ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ జాన్‌పాషా ముగించారు. సిపిఎం డివిజన్‌ నాయకులు కాకనబోయిన లింగారావు, నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, కోట రవికుమార్‌, రామకృష్ణ, షేక్‌ గౌస్‌మియా, ప్రణయ తేజ, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

శ్వేతపత్రం, చర్చల పేరుతో బాక్సైట్‌ తవ్వకాలకు కుట్ర 
-  ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి- విజయవాడ ప్రతినిధి
                   శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్‌ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్‌ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు బాక్సైట్‌ తవ్వకాలు అక్రమమని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు, ఇప్పుడు అవే విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు మధు బుధవారం ఒక లేఖాస్త్రాన్ని...

దేశంలో పేట్రేగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని పది వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించింది. గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలపాలని నాయకులు నిర్ణయించారు. జర్రెల ప్రాంతానికి 10 వామపక్ష పార్టీల నాయకులు వెళ్ళి బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా తొలగించడానికి నిరసనగా గ్రామాల్లో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వం పర్యటించాలని నిర్ణయించారు.

శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్‌ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్‌ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. విదేశానికి చెందిన రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ కోసమే ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించిందని విమర్శించారు. దేశీయ కంపెనీతో కలిసి రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని, ఆ కంపెనీ నష్టాలను అధిగమించేందుకు గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సిఎం చంద్రబాబుకు ప్రజా సంక్షేమం కంటే పెన్నా, రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీల మనుగడే ముఖ్యంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.  ...

భూదాహం వద్దు
దిష్టిబొమ్మ దహనంలో సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్‌
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు భూములను కట్టబెడుతోందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని పైకిచెబుతున్నా, లోపల మాత్రం ప్రజల నుండి ఏవిధంగా భూములు లాక్కోవాలో అన్న ఆలోచనతోనే ముందుకు సాగుతోందన్నారు. మచిలీపట్నం భూపోరాటంపై ప్రభుత్వ నిర్బంధం నశించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పటమట ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద ఆదివారం ఉదయం 'భూముల్ని తినే తోడేలు' దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజలను ఇబ్బందులు గురిచేయకుండా అవసరమైన మేరకే...

Pages