District News

భూదాహం వద్దు
దిష్టిబొమ్మ దహనంలో సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్‌
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు భూములను కట్టబెడుతోందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని పైకిచెబుతున్నా, లోపల మాత్రం ప్రజల నుండి ఏవిధంగా భూములు లాక్కోవాలో అన్న ఆలోచనతోనే ముందుకు సాగుతోందన్నారు. మచిలీపట్నం భూపోరాటంపై ప్రభుత్వ నిర్బంధం నశించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పటమట ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద ఆదివారం ఉదయం 'భూముల్ని తినే తోడేలు' దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజలను ఇబ్బందులు గురిచేయకుండా అవసరమైన మేరకే...

ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా రియల్‌ ఎనర్జీ సంస్థకు నగర పాలక సంస్థ డబ్బులు చెల్లించడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 30తో గడువు ముగిసినా కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా ఒప్పంద కాలపరిమితిని పొడిగించారని విమర్శించారు. అధికార టిడిపి ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిడితో అడ్డగోలుగా కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.  విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 41 శాతం మేర విద్యుత్‌ ఆదా చేసేందుకు 2014 ఆగస్టు 14వ తేదీ వరకూ వీధిలైట్ల నిర్వహణ రియల్‌ ఎనర్జీ సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుందని, కానీ ఆ రీతిలో విద్యుత్‌ ఆదా చేయలేదని తెలిపారు. అయినా 2007 నుండి...

బందరుపోర్టు, పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతూ కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలో శనివారం జరిగిన 'మీ ఇంటికి...మీ భూమి కార్యక్రమంలో అరెస్ట్‌ చేసిన భూపరిరక్షణ కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చౌటపల్లి రవి, పోతేపల్లి ఎంపిటిసి పిప్పళ్ళ నాగేంద్రబాబులు బెయిల్‌పై మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. ఎక్సైజ్‌ శాఖ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కృష్ణాజిల్లా బందరు మాజీ శాసనసభ్యులు, వైసిపి నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)కి బుధవారం బెయిల్‌ లభించింది.

బందరు పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల పేరుతో ఇచ్చిన భూ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న భూ పోరాట కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మసహా పలువురిని శనివారం అరెస్టు చేయడంపై ఆదివారం విజయవాడ, మచిలీపట్నాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యంలో కోనేరుసెంటర్‌ నుండి నవకళ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అనుబంధ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన...

ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడేంత స్థాయి తనకు లేదని, అక్కడున్న ఎంపిలు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఆ పని చేయాల్సి ఉంటుందని జనసేన అధినేత వపన్‌ కళ్యాణ్‌ అన్నారు. 2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. 

దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎఫ్‌డీఐలు చిచ్చు పెడతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు. విజయవాడలో సీపీఎం నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి బీసెంట్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఎఫ్‌డీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

విఆర్‌ఎల దీక్షలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎపిపిఎస్‌సి ద్వారా నియమితులైన 5,600 మంది విఆర్‌ఎలకు తగిన పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. రెవెన్యూ శాఖలో శాశ్వత ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతభత్యాలను విఆర్‌ఎలకూ చెల్లించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు లేవని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వామపక్షాలు విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ప్రభుత్వం పన్నుల విధానంలో మార్పు తీసుకురావడం వల్ల ధరలు పెరిగిపోయాయన్నారు. రైతు దగ్గర నుండి తీసుకున్న ధరకు నిమిత్తం లేకుండా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తయారు చేసిన జీఎస్టీ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని, దీనిని...

గన్నవరంలోని ఐటి పార్కు (మేధా టవర్స్‌)ను సెక్రటేరియట్‌గా ఉపయోగించుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వ చ్చే ఏడాది ప్రభుత్వ కార్యాలయాలు దీనిలో ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం సూచాయిగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మంత్రివర్గ నిర్ణయంతో అది కార్యరూపం దాల్చినట్లయింది.

కృష్ణాజిల్లా మైలవరం అయ్యప్పనగర్‌లో సిపిఎం మైలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భూ పోరాటం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.వి.ఆంజనేయులు నేతృత్వంలో పేదలు తమకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరుతూ 9.43 ఎకరాల భూముల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నాయకులను అరెస్టు చేసి స్థానిక స్టేషనుకు తరలించారు. అరెస్టులపై ఆగ్రహించిన పేదలు అక్కడి నుంచి ప్రదర్శనగా వచ్చి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Pages