District News

విలీన మండలాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆద్వర్యంలో నేడు బంద్ కొనసాగుతోంది..కూన‌వ‌రం, వీఆర్ పురం, చింతూరు, ఎట‌పాక‌, కుకునూరు, వేలేరుపాడులో  సీపీఎం ఇచ్చిన పిలుపు అంద‌రినీ క‌దిలించ‌డంతో వివిధ వ‌ర్గాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ముఖ్యంగా విలీనం జ‌రిగి ఏడాదిన్న‌ర గ‌డుస్తున్నా క‌నీస స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం కాక ర‌గిలిపోతున్న జ‌నాల ఆగ్ర‌హం బంద్ రూపంలో వ్య‌క్త‌మ‌వుతోంది.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు చింతూరులో బంద్ కార్యక్రమంలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు..

 

 

సెప్టెంబరు 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సిపిఎం తన సంపూర్ణ మద్ధతు తెలియజేసింది. కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సామాన్యులను వంచించి, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్‌ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న కార్పొరేట్ల కోసమే పాలన సాగిస్తున్న పాలకులకు ఈ సమ్మె ద్వారా కార్మికవర్గ హెచ్చరికను తెలియజేయాలన్నారు. ఏవిధమైన కార్మికుడికైనా కనీస వేతనం రూ.15 వేలు తగ్గకుండా ఉండాలన్నారు. కార్మిక చట్టాలు, పకడ్బంధీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా...

సిపిఎం ఆధ్వర్యాన రాజమండ్రిలో "ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు" అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధ్యసాధ్యాల పై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కై సిపిఎం కృషి చేస్తోందన్నారు. 

కులాలు, మతాలు, మతతత్వం వంటి అంశాలు ప్రాబల్యం చూపుతున్న నేటి పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొలిపేది సాహిత్యమేనని సాహిత్య ప్రస్థానం ఎడిటర్‌, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం స్థానిక రోటరీ క్లబ్‌ హాల్లో జరిగింది. ప్రముఖ కవి డాక్టర్‌ అదేపల్లి రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఎంఎల్‌సి రాము సూర్యా రావుతోపాటు తెలకపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రవి మాట్లా డుతూ సాహిత్యం నేటి యువత రాన్నీ, విద్యార్థులనూ ఆకట్టు కునేలా ఉండాలన్నారు. 
సమాజానికి ప్రతి ఒక్కరూ అక్షరంతోగానీ, బోధనతో గానీ సేవలందిం చాలన్నారు. కుల, మతతత్వాలు, నిరంకుశత్వాలను నేటి పాలకులు పెంచి...

ప్రజా సమస్యలపై సిపిఎం ప్రచారాందోళనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు పాఠశాలలనూ, పిహెచ్‌సిలనూ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్‌తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్‌ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్‌ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్‌ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్‌ ఆరోపించారు.

ఏపీ మంత్రిమండలి సమావేశం రాజమండ్రిలో బుధవారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరిగింది. ఇప్పుడు రాజమండ్రి వేదికగా మారింది.  మంగళవారం రాత్రికే మంత్రులు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో సహా సీనియర్‌ ఐఎఎ్‌సలంతా రాజమండ్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పది గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించి.. ఆమోదించనున్నారు. మరికొన్ని కీలకాంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ఈ భేటీలో రాజమండ్రి అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా టూరిజం అభివృద్ధిపై దృష్టిసారించాలని...

సిపిఎం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నుంచీ వ్యవసాయ సాగు ప్రారంభించారు. జూలై 13న కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 200 మంది ప్రజలు ఈ భూముల్లో ప్రవేశించి గురువారం దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు వెదజల్లారు. ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు.సుమారు 15 బస్తాల వరి విత్తనాలను నాటామని తెలిపారు. 

మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటుచేసుకున్న మహా విషాదం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. సర్కారీ నిర్లక్ష్యానికి రెండు డజన్లకు పైగా నిండు ప్రాణాలు గోదారిలో కలిసిపోయాయి. మృతులలో ఎక్కువ మంది మహిళలే. మరో 30 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సర్కార్‌ అనుసరించిన దారుణ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఈ తొక్కిసలాట. ప్రతి పన్నెండేళ్లకొకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో కనీవిని ఎరుగని ఘోరమిది. చంద్రబాబు ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే ఈ మహా విషాదం నివారించబడేది. క్షతగాత్రుల హాహాకారాలు, మృతుల కుటుంబాల...

రాజమండ్రి దుర్ఘటనను ప్రభుత్వ వైఫ్యలంగా చూపి రాజకీయ కోణంలో విమర్శలు చేయడం తగదని హిందు ధర్మ ప్రచారకులు కమలానందభారతి అన్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం సముచితం కాదని,ప్రతిపక్షాన్ని, ఇతర ప్రజాసంఘానులను ఉద్ధేషించి ఆయన అన్నారు. పుష్కరాల్లో మృతి చెందిన వారు పుణ్యలోకాలకు వెళ్లినట్టుగా భావించాలన్నారు. తెలంగాణలో పుష్కరాలకు నీరు తక్కువగా ఉందని, అందుకోసం మహారాష్ట్ర నుంచి నీటి విడుదలకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని కమలానంద భారతి సూచించారు.

Pages