District News

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ మండలంలోని పిడింగొయ్యిలోని వివాదాస్పద భూమిలో ఆలయ ప్రవేశానికి అవకాశం కల్పించా లంటూ విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నాయకులు, స్థానిక పెత్తందార్లతో కలిసి గురువారం రూరల్‌ తహశీల్దార్‌ జి.భీమారావుపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. 

 జిల్లాకు ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా కపోవడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక వరం లాగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షలాది ఎకరాలు పంట భూములుగా సాగులోకి తీసుకురావచ్చునని ప్రకటిస్తున్నారు. కానీ ఇది ఆచరణలో ఎంత సాధ్యమో గత దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పార్టీలు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమౌతుంది. నాటి ముఖ్యమంత్రి అంజయ్య మొదలుకుని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మనం పరిశీలన చేస్తే వాళ్ళకు రాజకీయంగా...

మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారస్తంభం సెంటర్లో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రమణి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యానికి పోరాడాలన్నారు. మద్యం వల్ల హింస పెరిగిపోతోందని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని అన్నారు. మద్యపానం నిషేధించే వరకూ వివిధ రూపాల్లో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు

 భగత్‌సింగ్‌ స్ఫూర్తితో సమస్యలపై విద్యార్థులు ఉద్యమాల్లో ముందుండాలని మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపు నిచ్చారు. భగత్‌సింగ్‌ 108వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎజిహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కారం నాగేశ్వరావు అధ్యక్షతన ఆదివారం సభ జరిగింది. మిడియం మాట్లాడుతూ నాడు భారతదేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యువకిషోరం భగత్‌సింగ్‌ అని ఆయన కొనియాడారు. యువకుల్లో విప్లవాన్ని రగిలించి, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వెరవకుండా తీవ్రమైన పోరాటాన్ని నడిపించారని. 1907లో జన్మించిన భగత్‌సింగ్‌ భరతమాత విముక్తే ధ్యేయంగా 23 ఏళ్లకే ఉరితాడును ముద్దాడారని చెప్పారు. అదే స్ఫూర్తితో విద్యా రంగంలోని సామ్రాజ్యవాదులపై ఎస్‌ఎఫ్‌ఐలో...

ప్రభుత్వ విద్యారంగాన్ని నూతన విద్యాసంస్కరణల పేరుతో టిడిపి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 రోజులపాటు నిర్వహించిన 'విద్యాపరిరక్షణ సైకిల్‌యాత్ర' ముగింపు సభ ఆదివారం స్థానిక జగన్నాథపురం చర్చిస్క్వేర్‌ వద్ద జరిగింది. సభలో రాము మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. నూతన సంస్కరణల పేరుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు...

 చింతూరు మండలంలో సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వైద్యశిబిరంలో ఆదివారం 35 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురిని మలేరియా బాధితులుగా గుర్తించారు. ఆదివారం వివిధ గ్రామాలకు చెందిన 100 మంది వైద్యశిబిరానికి వచ్చారు. వారిలో ఐదుగురు మలేరియా బాధితులు ఉన్నారని సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు తెలిపారు.రోజురోజుకూ వైద్యశిబిరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని, వారందరికీ తగిన వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.

 

 తూర్పుగోదావరి జిల్లా చింతూరులో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక, ఎపిఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. మన్యంలో మలేరియా కేసులు లేవని ప్రభుత్వం చెబుతోంది. వైద్య శిబిరంలో బ్రెయిన్‌ మలేరియా కేసులు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చింతూరులో ఈనెల 23న ప్రారంభమైన వైద్య శిబిరం అక్టోబర్‌ 22 వరకు కొనసాగనుంది. బుధవారం 43 గ్రామాల నుంచి రోగులు తరలివచ్చారు. 109 మందికి పరీక్షించగా, 22 మంది జ్వరపీడితులు ఉన్నారు. వీరిలో ఆరు బ్రెయిన్‌ మలేరియా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  మిడియం బాబూరావు చెప్పారు. గురువారం 50 మంది రోగులను పరీక్షించగా, వారిలో 13 మంది...

అధికార పార్టీ నాయకులు, మట్టిమాఫియా, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రామేశంపేట మెట్ట భూమిలో మట్టిని కొల్లగొట్టుకుపోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తంచేశారు. రామేశంపేట మెట్ట భూముల దళిత రైతులు సిపిఎం ఆధ్వర్యాన పెద్దాపురం తహశీల్దార్‌, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల మాట్లాడుతూ దళితులకు ఉపాధి నిమిత్తం ఇచ్చిన అసైన్డ్‌ భూములను 9/77 యాక్టు ప్రకారం అమ్మకాలుగానీ, కొనుగోళ్లు గానీ చేయకూడదన్నారు. జిఒ 2/2013ను చూపించి చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రామేశంపేట మెట్టచుట్టూ నోట్లకట్టల రాజకీయం నడుస్తోందన్నారు. 

పెండింగ్‌ వేతనాలు, పారితోషకాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆశావర్కర్లు తూర్పుగోదావరి జిల్లా చింతూరు రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణమూర్తి మాట్లాడారు. ఎంఎల్‌ఎ, ఎంపీల ఇంటి అద్దె అలవెన్సు పెంచుతున్న ప్రభుత్వం తక్కువ వేతనంతో కాలం వెళ్లదీస్తున్న ఆశాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ముంపు మండలాల కార్మికుల సంక్షేమం పై శద్ధ చూపడంలేదన్నారు. తహశీల్దార్‌ శివకుమార్‌ ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. అడిషనల్‌ డిఎంహెచ్‌ఓతో ఫోన్లో మాట్లాడారు.

కాకినాడ సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను జడ్‌పి ఛైర్మన్‌ నామన రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడంతోపాటు సమాజ మార్పునకు పుస్తక పఠనం దోహదం పడుతుందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ 'నేను మలాలా' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

Pages