దళిత వ్యతిరేక విధానాలకు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దళితులు ఉప్పెనలా కదలాలని సిపిఎం, సిపిఐ రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. సామాజిక న్యాయం, దళిత సంక్షేమం, సమగ్రాభివృద్ది కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసి రండి పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశానికి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి.అరుణ్, తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల సామాజిక న్యాయం బలైందన్నారు. దళితులు, కార్మికులు, గిరిజనులు ఉన్న హక్కులు కోల్పోతున్నారన్నారు. ఎస్సి సబ్‌ప్లాన్...
District News
తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కనిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల సమస్యలపై సీపీఎం ఉద్యమం ప్రారంభించింది. ప్రజా సమస్యల సాధన కోసం పాదయాత్ర సాగిస్తోంది. కాకినాడలో ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దళిత సంఘాల నేతలు రామేశ్వర రావు సహా పలువురు మద్ధతు తెలిపారు.నగరంలోని దళిత, మత్స్యకార పేటల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పాదయాత్ర నగరంలోని అన్ని డివిజన్లలోనూ సాగుతుందన్నారు.
నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరో సారి ప్రమాదం సంభవించింది.గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాకముందే మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.
ఎ.పి కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని గడియార స్ధంబం సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ ఏర్పాటు చేశారు.. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిర్ణయాన్ని తెలపాలని విజ్ఞప్తి చేశారు .
ఈస్ట్ గోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజీపేటలో దివీస్ భూ సేకరణకు వ్యతిరేకంగా నేడు సీపీఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనితో పలువురు సీపీఎం నేతలను గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 7న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 7న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా లక్షల మంది గిరిజనులను, ఇతర పేదలను జలసమాధి చేయడానికి పూనుకున్నా యన్నారు. 12 ఏళ్లుగా 12 గ్రామాలకు పునరావాసం కల్పించలేని ప్రభుత్వం 2018 నాటికి 400 గ్రామాలకు పునరావాసం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అనేకేళ్లుగా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే ప్రభుత్వ వాటికి హక్కులు కల్పించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు....
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్దతిలో సేవలందిస్తున్న 240మంది ఉద్యోగులకు జి.వో 151 ప్రకారం కనీసవేతనాలు ఇవ్వాలని చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జి .. రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, మిగిలిన వామపక్షాలను కలుపుకొని సమస్య పరిష్కరానికి ఉద్యమిస్తామని తెలిపారు...
పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపించడానికి అవకాశామున్న పుసుషోత్తపట్నం ప్రాంతం, కాతేరు, పుష్కర ఎత్తిపోతల పథకాలను సిపిఎం బ్రందం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యయనం బ్రందం తొలి దశలో ఎడమ కాలువ పనులు 58కిలో మీటర్లు వరకు పూర్తిచేసి ఏలేరు నదిలోకి విడిచిపెట్టి ఏలేరు రైతుల ఆయకట్టు 70వేల ఎకరాలకు నీరు అందించడం వల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న 10టిఎంసిల నీటిని విశాఖపట్నం తరలించవచ్చని సూచించారు. రెండో దశలో 58కిలో మీటర్లు నుంచి 162 కిలోమీటర్లు ( ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్లపాలెం) వరకు ప్రస్తుతమున్న ఏలేరు నీటిని కెనాల్ ద్వారా నీటిని పంపించవచ్చన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ప్రజల తాగు, సాగు, పారిశ్రామిక...