District News

విజయవాడ:సింగపూర్‌ ఇంజనీర్లు తయారుచేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీర్లు తయారు చేయలేరన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇక్కడి ఇంజనీర్లను అవమానించారన్న మధు.. ఈ ముఖ్యమంత్రికన్నా సింగపూర్‌ మంత్రులే మేలన్న విషయాన్ని చంద్రబాబే పరోక్షంగా ప్రకటించినట్లు అయిందని ఎద్దేవా చేశారు.

పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్‌తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్‌ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్‌ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్‌ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్‌ ఆరోపించారు.

రాజ్యసభ సీటు కోసమే రఘువీరా రెడ్డి రాహుల్‌ గాంధీతో పాదయాత్రలు చేయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మాట్లాడుతూ అనంతపురానికి ఆనుకొని ఉన్న కర్నాటకలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాహుల్‌ గాంధీ అక్కడ ఎందుకు యాత్రలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ లు కేవలం అనంతపురం, హిందూపూర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లోనే ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హొదా దాదాపు లేనట్లుగానే తేలిపోయిరది. నాలుగు నెలల క్రితమే రాష్ట్ర అధికా రులకు కూడా కేంద్రం నురచి సంకేతాలు వచ్చాయి. సీనియర్‌ అధికారి ఒకరు కేంద్ర నిర్ణయాన్ని అనధికారంగా వెల్లడిరచారు కూడా. అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యేక హౌదా తెరపైకి వస్తోరది. అధికార తెలుగుదేశం పార్టీ నురచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇదే అరశంపై గత నాలుగు రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. నెల రోజుల్లో ప్రత్యేక హౌదా వస్తురదని, దీనికోసం పోరాటం కొనసాగి స్తామని, కేంద్రం కూడా ప్రత్యేక హౌదా ఇచ్చేరదుకు ఆలోచన చేస్తోరదని చెప్పుకురటూ వస్తున్నారు. అయితే ఇతర వర్గాల నురచి మాత్రం ఎరటువంటి స్పందన కనిపిరచడం లేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

2018 నాటికి సీడ్‌క్యాపిటల్‌ను నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 1694.5 హెక్టార్ల(4236 ఎకరాలు)లో దీని నిర్మాణం జరగ నుంది. దీనికిగాను రూ.8214 కోట్లు ఖర్చవుతుం దని అంచనా వేసింది. ఐదుదశల్లో నిర్మించ నున్న రాజధానికి సంబంధించి తొమ్మిది యాక్షన్‌ ప్లానులు రూపొందించారు. రాజధాని నగరంలో 88 కిలో మీటర్ల పొడవున రోడ్లను నిర్మించనున్నారు. ఐదు దశల్లో ఏ దశలో ఎంత స్థలం వినియోగం అవు తుంది, ఎన్ని ఉద్యోగాలొస్తాయి అనే అంశా లనూ పొందుపరిచారు. సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్‌ కన్సలెంట్స్‌ ప్రైవేటు లిమి టెడ్‌, జురాంగ్‌ ఇంటర్నేషనల్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ట్రేండ్‌ అండ్‌ ఇండిస్టీ, సింగపూర్‌ కార్పొరేషన్‌ ఎంటర్‌...

vzm

యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ సంస్థ రూపొందించిన సీడ్‌ కాపిటల్‌ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్‌లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్‌ కేపిటల్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం రాజమండ్రిలో సింగపూర్‌ మంత్రి ముఖ్యమంత్రికి అందజేసిన సిటీ నమూనా ఆంధ్రుల రాజధాని అమరావతి నగరి రూపురేఖలను కళ్లకు...

మాస్టర్‌ప్లాను నివేదిక ప్రకారం ప్రసుత్తం గ్రామాలు తరలిస్తామంటున్నారని, రేపు ఉన్న ప్రజలనూ తరలించేస్తారని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు అన్నారు. గ్రామాల్లో రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్‌తో కలిసి పర్యటించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళనకు దిగడంతో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. వరదలొచ్చినా వారు ఇక్కడే ఉన్నారని, నష్టపోయారని, ఇప్పుడు కొద్దిమంది లాభం కోసం తరిమేస్తామంటే ఎలా వెళతారని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదలను, ముఖ్యంగా దళితులను ఇక్కడ నుండి తరిమేసే ప్రక్రియ...

 రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వీసా వివాదంపై చర్చ జరగాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మెన్ కురియన్ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభయ్యాక కూడా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ప్రారంభమైన కొద్ది క్షణాలకే ప్రతిపక్ష సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ చైర్మెన్ హమిద్ అన్సారీ అరగంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ కేంద్రమంత్రి సంతోష్‌ బగ్రోడియాకు పాస్‌పోర్టు ఇప్పించాలని ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత లాబీయింగ్‌ చేసినట్లు సుష్మా ట్వీట్‌ చేశారు. పార్లమెంటులో ఆ...

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు తిరిగొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేయించలేని పక్షంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక లెనిన్‌ సెంటర్లో మంగళవారం మాక్‌ పార్లమెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కనీసం గంట సేపయినా రాష్ట్రానికి...

Pages