రాజ్యసభలో మళ్లీ రగడ

 రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వీసా వివాదంపై చర్చ జరగాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మెన్ కురియన్ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభయ్యాక కూడా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ప్రారంభమైన కొద్ది క్షణాలకే ప్రతిపక్ష సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ చైర్మెన్ హమిద్ అన్సారీ అరగంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ కేంద్రమంత్రి సంతోష్‌ బగ్రోడియాకు పాస్‌పోర్టు ఇప్పించాలని ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత లాబీయింగ్‌ చేసినట్లు సుష్మా ట్వీట్‌ చేశారు. పార్లమెంటులో ఆ నేత పేరు వెల్లడిస్తామని ప్రకటించినా కూడా కాంగ్రెస్ పార్టీ సుష్మా స్వరాజ్ రాజీనామాకు పట్టుబట్టింది.