District News

రాజధాని ప్రాంతంలో డ్వాక్రా మహిళలకు ఏకకాలంలో రూ. లక్ష రుణ మాఫీ చేయకపోతే గ్రామాల్లో ఉన్న క్రిడా కార్యాలయాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి హెచ్చరించారు. రూ. లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరులోని క్రిడా కార్యాలయం ఎదుట మంగళవారం డ్వాక్రా మహిళలు నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా మహిళలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు, ఇప్పుడు వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేస్తామనడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు తమ తడాఖా చూపిస్తారని హెచ్చరించారు. ఏడాదిన్నరగా రుణ బకాయిలు కట్టని మహిళలు ప్రస్తుతం చేసేందుకు పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో...

ఉమ్మడి రాజధానిలో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించే ప్రక్రియలో వేగం పెంచేందుకు ఏపీ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వారానికి 3 రోజులు రాజ‌ధాని నుంచి పాలిస్తున్న సీఎం పూర్తిస్థాయిలో అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయ‌డానికి అనువైన ప్రైవేట్ భవనాలను ప‌రిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న బాబు.. ఇరిగేషన్‌కు సంబంధించిన 9 కార్యాలయాల‌ను తరలించటానికి చర్యలు...

పేద‌ల సాగులో ఉన్న అట‌వీ భూముల‌ను స్వా‌ధీనం చేసుకోవ‌ద్ద‌ని కోరుతూ సిపిఎం ఆధ్వ‌ర్యంలో కృష్ణా జిల్లా మైల‌వ‌రం జాతీయ ర‌హ‌దారిపై రాస్తా‌రోక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ను పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం పోలీసులు మైల‌వ‌రం పోలీసు స్టే‌ష‌న్ కు త‌ర‌లించారు. పోలీసుల‌కు పేద‌ల‌కు మ‌ద్య వాగ్వా‌దం జ‌రిగింది. పోలీసులు విచ‌క్ష‌ణ ర‌హితంగా వారిని ఈడ్చి పారేశారు.  

కృష్ణాజిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మధు మాట్లాడుతుండగా పోలీసులు మైక్‌ లాక్కొని...ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు, సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీభూముల్లో సాగును అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని...

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, దీనిని ప్రైవేట్‌పరం చేయరాదని డిమాండ్‌ చేస్తూ నేడు విశాఖజిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద సిపిఐ(యం) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
    ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ విమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం మొదటి దశ పూర్తయి మూడేళ్ళు అయినా రాష్ట్రప్రభుత్వాలు వివక్షత, నిర్లక్ష్యం వల్ల నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఇటీవ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు విమ్స్‌ను ప్రభుత్వ-ప్రైవేట్‌-భాగస్వామ్యం (పిపిపి) పేర బడా కార్పొరేట్‌ సంస్థలకి ధారాధత్తం...

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో రెండుసార్లు ఆ దేశంలో పర్యటించారు. జపాన్‌కు చెందిన పలు...

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడున్నర వేల మంది కార్మికులను అరెస్టు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జీలు జరిపారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుసహా పలువురు వామపక్ష నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. పిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబలేసు సహా వేలాది మందిని అరెస్టు చేశారు. విశాఖలో 2,500 మందినీ, రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద మరో వెయ్యి మందినీ అరెస్టు చేశారు. 

అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలైతే మరింత కష్టకాలం తప్పదు. తెలంగాణలో మందుబాబులకు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అక్కడి సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విధానం అమల్లోకి వచ్చి.. సారా ప్యాకెట్ల(సాచెట్లు) తరహాలో చీప్‌లిక్కర్‌ మద్యం దుకాణాల్లోకి ప్రవేశిస్తే.. ఏపీ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఆందోళన చెందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఏపీకి చెందిన ప్రధానమైన ఐదు జిల్లాల్లో తెలంగాణ చీప్‌లిక్కర్‌ ఏరులై పారనుంది. రాయలసీమలోని కర్నూలు, కోస్తాలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు తెలంగాణకు సరిహద్దు...

పార్లమెంటు దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే ఇది పార్లమెంటు వద్ద జరిగిన మాక్‌డ్రిల్‌ అని తెలిసింది. ఒకవైపు పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌ జిల్లా దినానగర్‌లో ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశ సరిహద్దులతో పాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

Pages