
అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూ దందా నిర్వహిస్తోందని, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన వేల ఎకరాలు భూములు ప్రయివేటు వ్యక్తులకు, విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. స్థానిక టీచర్స్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం డివిజన్ సెక్రటేరియట్ సభ్యులు చిరుమామిళ్ల హనుమంతురావు అధ్యక్షత వహించారు. ఇందులో పలువురు మేధావులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు క్రీడా కన్వీనర్ సిహెచ్ బాబూరావు దీనిపై మాట్లాడారు. రాజధాని నిర్మించే 29 గ్రామాల్లో ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని సేకరించిందని, మరో 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని 50 వేల ఎకరాల ఫారెస్టు భూమిని కూడా సేకరించటానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాజధాని అభివృద్ధి పేరుతో కూడా ప్రభుత్వం లక్షా 10 వేల ఎకరాల భూమిని సేకరించిందని తెలిపారు. ప్రయివేటు వ్యక్తుల నుండి భూమిని సేకరించాలని చూడటంలో ప్రభుత్వ భూ దాహాం తేటతెల్లమవుతుందన్నారు.