
జిల్లాకేంద్రంలోని పెద్దాసుపత్రిని ప్రయివేటు సంస్థ మాన్సాస్కు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన గురువారం ధర్నా చేశారు. ఆసుపత్రి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ స భ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజి లేని జి ల్లా విజయనగరమేనన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు కూడా జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారని తెలిపారు. కానీ నేడు కేంద్రమంత్రి అశోక్గజపతికి చెందిన మాన్సాస్ సంస్థ కు కేంద్రాసుపత్రిని కట్టబెట్టాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజి ఏర్పాటుకు చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు