
సెప్టెంబర్ 2 దేశవాపితంగా కార్మికవర్గం చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకత్వంలో భారీ స్కూటర్ ర్యాలీ జరిగింది. ఈ స్కూటర్ ర్యాలీ జివిఎంసి కార్యాలయం వద్ద ప్రారంభమై జగదాంబ, కలెక్టర్ ఆఫీస్, చౌట్రీ, పూర్ణామార్కెట్, కొత్తరోడ్, రైల్వేస్టేషన్, గురుద్వార్, హెచ్.బి.కాలనీ, వెంకోజీపాలెం, ఎం.వి.పి., మద్దిలపాలెం, కాంప్లెక్స్ మీదుగా జగదాంబ సిఐటియు కార్యాలయం వరకు జరిగింది. సుమారు 40 కిలోమీటర్లు తిరిగారు. సెప్టెంబరు 2న సరస్వతీ పార్కు నుండి ఉదయం 10 గంటలకు ప్రదర్శన ఉంటుందని దీనిలో పెద్ద ఎత్తున కార్మికవర్గం పాల్గొవాలని సిఐటియు నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పిలుపునిచ్చారు.