
2015 ఆగస్టు 31
పట్టణప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్న వారి ఇళ్ళను 100 చదరపు గజాలు వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలుగుదేశం ప్రభుత్వం 12-8-2015న జివోనెంబర్ 296ను విడుదల చేసింది. ఈ జివో ప్రకారం పేదలు ఆగష్టు 15 నుండి దరఖాస్తును ‘మీసేవా’ ద్వారా తహశీల్ధార్ కార్యాయాలకు పంపించుకోవాలని తెలియజేసింది. జివో విడుదలై 15రోజులు దాటినప్పటికీ ‘మీసేవా’లో ఇళ్ళ క్రమబద్ధీకరణ దరఖాస్తు ఇవ్వటం గాని లేదా తీసుకోవటం గాని జరగటం లేదు. ఇప్పటివరకు విధి విధానాలను కూడా ప్రజలకు తెలియజేయలేదు. ఫలితంగా విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో సుమారు 70వేమంది ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్నప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై నేడు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌ను సిపియం నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు నాయకత్వంలో ఆర్.కె.ఎస్.వి.కుమార్, కె.ఎం.కుమార్ మంగళం, వి.కృష్ణారావులు కలిసి వినతప్రతాన్ని అందజేసాయి.
తేది 01-09-2015 నుండి ఇళ్ళ క్రమబద్ధీకరణ దరఖాస్తులను ‘మీసేవా’లో తీసుకునేలా చర్యలు
దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయడానికి మీసేవా 35 రూపాయలు తీసుకోవాలని ఆదేశాలు
దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని కూడా మీసేవాకి ఇవ్వొచ్చుని చెప్పారు.