
వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, వరదల వల్ల నష్టాలపాలైన రైతులకు పరిహారం చెల్లించాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, భూసేకరణ ఆర్డినెన్స్ విరమించుకోవాలని తదితర 17 డిమాండ్లతో వామపక్ష రైతు సంఘాలు గురువారం నాడు 'చలో సచివాలయం' కార్యక్రమాన్ని చేపట్టాయి.ప్రజాస్వామిక హక్కులను కాలరాయడంలో అందెవేసిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరోసారి పైశాచికానికి పాల్పడింది.సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రశాంతంగా నిర్వహిస్తున్న ప్రదర్శనపైకి పోలీసులను ఉసిగొల్పి నెత్తుటేరుల్లో ముంచింది. దీంతో కొల్‌కతా నగర వీధులు రణరంగంగా మారాయి. ఖాకీల దాష్టీకానికి లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసుతో సహా రెండు వందల మందికిపైగా ప్రదర్శకులు గాయపడ్డారు. బిమన్ బసుకు, మరి కొందరు ఎంపీలు, ఇతర నాయకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాషీకాన్ని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ దాష్టీకం పట్ల బెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి.