బాబు పక్కా బిజినెస్ మాన్:మధు

రాజధాని నిర్మాణం పేరుతో రైతుల వద్ద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కారద్యర్శి పెనుమల్లి మధు అన్నారు. ఏకంగా 1.20 లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. వీటిని బడా పారిశ్రామిక వేత్తలకు 99 ఏళ్ల పాటు కారుచౌకగా లీజుకిస్తున్నారని వాపోయారు. చంద్రబాబు చేస్తున్నది పక్కా బిజినెస్‌ అని, అభివృద్ధి కాదని తెలిపారు. పరిశ్రమలు, విమానాశ్రయం పేరుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది ఎకరాలను రైతుల వద్ద నుంచి లాక్కుంటున్నారని తెలిపారు.