
కోరంగి భూముల ఘటనపై న్యాయం చేయాలని ఎస్పి రవిప్రకాష్, ముమ్మిడివరం ఎంఎల్ఎ దాట్ల బుచ్చిబాబు, కాకినాడ ఆర్డిఒ అంబేద్కర్లను అఖిలపక్షం నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నాయకుల బృందం ముమ్మిడివరం ఎంఎల్ఎను కలిసి ఘటనా వివరాలను, పేదలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనికి స్పందించిన ఆయన పోలీసుల అత్యుత్సాహంపై ఎస్పితో మాట్లాడారు. ఆర్డిఒకు ఫోన్ చేసి భూములపై సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని విచారణ నిర్వహించాలన్నారు.