
రాజధాని పరిధిలో భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను, రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి. మధు అన్నారు. అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భూసమీ కరణకు భూమి ఇవ్వకుండా ఉన్న రైతుల నుంచి భూమిని తీసుకోవడానికి రాష్ట్ర పభ్రుత్వం భూసే కరణ నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. దీనికి నిరస నగా ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పెదకాకాని పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. అరెస్టు చేసిన వారిలో సిపిఎం నాయకులు సిహెచ్. బాబూరావు, జె. శివ శంకర్, రవి, నవీన్ వైకాపా నాయకులు శ్రీని వాస్రె డ్డితో పాటు రైతులు కూడా ఉన్నారన్నారు. వారిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ ఆల్చోనల్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.