
ఇద్దరు ఇంటర్ విద్యార్థునుల బలన్మరణానికి కారణమైన కడప జిల్లాలోని నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరులో పోలీసులు విద్యార్థులపై జులుం ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పిడిఎస్యు ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడారు. పిడిగుద్దులతో బీభత్సాన్ని సృష్టించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థిని తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్థించినా పోలీసులు పట్టించుకోలేదు. 29 మందిని అరెస్ట్ చేసి అరండల్పేట పోలీసు స్టేషన్కు తరలించారు.