
ప్రజలకు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి 47వ వార్డు పరిధి గుల్లలపాలెం జివిఎంసి ఆసుపత్రి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్ని నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారని, మల్కాపురం, శ్రీహరిపురం ప్రాంతాల్లో రెండు డిస్పెన్షరీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పేరుకే 30 పడకల ఆసుపత్రులైనప్పటికీ, కొన్ని వ్యాధులకే మందులుంటున్నాయని పేర్కొన్నారు. సుగర్ టెస్టులు చేయాలంటే ట్యూబులు లేవని, రక్తహీనతకు, కీళ్ళ నొప్పులు తదితర వ్యాధులకు మందులు ఉండడం లేదని తెలిపారు.