
భజరంగ్ జూట్‌మిల్లు అక్రమ లాకౌట్ వ్యవహారాన్ని తేలుస్తారో.. లేక తేల్చుకోమంటారో తేల్చి చెప్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. గఫూర్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం దీక్షలను ఆయన ప్రారంభించారు. గఫూర్ మాట్లాడుతూ భజరంగ్ జూట్‌మిల్లు ఆస్తులు ప్రస్తుత యజమానివి కావన్నారు. ఆ వాస్తవాన్ని గమనించి మిల్లు నడపడం చేతకాకపోతే ప్రభుత్వానికి అప్పగించిపోవాలే తప్ప అమ్ముకునేందుకు వారికి హక్కు లేదన్నారు. వారు ఈ విషయాన్ని గుర్తెరగని పక్షంలో 'ఇది కార్మిక ఆస్తి' అని ఇక్కడ బోర్డు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.