వైద్య విద్యార్థుల ఆందోళనకు సిపిఐ(యం) సంఫీుభావం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 జూలై, 2025.

వైద్య విద్యార్థుల ఆందోళనకు సిపిఐ(యం)  సంఫీుభావం
        విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకొని డాక్టర్లుగా తిరిగి వచ్చిన వైద్య
విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఎన్టీఆర్‌ వైద్య
విశ్వవిద్యాలయం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా గత 6
రోజులుగా విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థుల
దీక్ష శిబిరంలో ఈరోజు (05 జూలై) సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పాల్గొని
సంఫీుభావం తెలియజేశారు. వారి ఆందోళనకు పూర్తి మద్దతును ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వారి సమస్యను పరిష్కారం  చేయాలని
డిమాండ్‌ చేశారు.
        గత 13 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చుట్టూ తిరుగుతున్నా
అధికారులు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఇవ్వకుండా ఉండడం సరికాదన్నారు.
వెంటనే వారందరికీ శాశ్విత రిజిస్ట్రేషన్‌పై సంతకం చేసి విద్యార్థులకు
న్యాయం చేయాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను
కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.
        శాంతియుతంగా తమ న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వారిపై
పోలీసులు బలప్రయోగం చేసి హడలెత్తించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా
చావబాదారు. ప్రజలకు సేవ చేయాల్సిన డాక్టర్లు ఈరోజు రోడ్లపై నిరసనలు
చేయాల్సి రావడం బాధాకరం అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ
వ్రాయడం జరిగింది.

(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org