సిపిఎం కార్యకర్త వడ్ల వెంకటేశ్వర్లును అక్రమంగా నిర్బంధించి వేధించిన ఘటనపై

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
కె.ప్రభాకరరెడ్డి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి)కి వ్రాసిన
లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీస్‌ కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 22 మే, 2025.

శ్రీయుత డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి) గారికి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
మంగళగిరి.
             విషయం :    కర్నూలు జిల్లా కర్నూల్‌ మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సి.ఐ
గారు సిపిఎం కార్యకర్త వడ్ల వెంకటేశ్వర్లును అక్రమంగా నిర్బంధించి వేధించిన
ఘటనపై విచారణ జరిపి సదరు సి.ఐ గారిపై శాఖాపరమైన చర్య తీసుకోవాలని, అక్రమ
నిర్భంధంలో ఉన్న వడ్ల వెంకటేశ్వర్లును విడిపించాలని కోరుతూ...
అయ్యా!
        కర్నూలు జిల్లా కర్నూలు మండలం  గొందిపర్ల గ్రామ పరిధిలో ఉన్న శ్రీ రాయలసీమ
ఆల్కాలిస్‌ (ూRAAజ) కెమికల్‌ పరిశ్రమ విస్తరణ గురించి మే 14వ తేదీన
కర్నూల్‌ ఆర్డిఓ అధ్యక్షతన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వారి ఆధ్వర్యంలో
బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ సందర్భంగా కెమికల్‌ పరిశ్రమ
విస్తరణలో వాడే విష రసాయనాల వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనారోగ్య
సమస్యలు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఆ ప్రాంతంలోని
గాలి, నీరు, భూమి కలుషితం అయ్యే అవకాశం ఉందని కనుక విష రసాయనాలను
వినియోగించి పర్యావరణానికి విఘాతం కలిగించే రసాయన పరిశ్రమ విస్తరణకు
అనుమతించవద్దని ప్రజా సంఘాలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ప్రజాభిప్రాయ
సేకరణ జరుతున్న సభకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు.
        ఆ పరిశ్రమ మాజీ ఎంపీ, మాజీ మంత్రి,  బిజెపి నాయకుడు టీజీ వెంకటేష్‌ గారికి
సంబంధించిన పరిశ్రమ కావడంతో తన పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, కర్నూలు
నగరంలో తన అనుయాయులుగా ఉన్న అసాంఘిక శక్తులను, రౌడీలను కూడగట్టి
ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులను భౌతికంగా దాడి
చేయించారు.  అలా దాడికి గురైన వారిలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎం.డి
ఆనంద్‌ బాబు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గొల్ల రాఘవేంద్ర ఉన్నారు. టీజీ
వెంకటేష్‌ గారి ప్రోత్సాహంతోనే, వారి కనుసన్నలలోనే కర్నూలు పట్టణానికి
చెందిన తెలుగు రమేష్‌ మరి కొంతమంది రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారు. టీజీ
వెంకటేష్‌ గారి పైన గాని, దాడి చేసిన రౌడీల పైన గాని పోలీసులు  ఎటువంటి
చర్య తీసుకోలేదు.
        కానీ ఈ ఘటనను నిరసిస్తూ ఒక కవితను రాసిన కర్నూలు నగరం లక్ష్మీ నగర్‌ లో
నివాసం ఉంటున్న  వడ్ల వెంకటేశ్వర్లు  అనే సిపిఎం కార్యకర్తను నిన్న కర్నూలు
నగరంలోని మూడవ పట్టణ పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌  శేషయ్య గారు
వెంకటేశ్వర్లును పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి సాయంత్రం విడిచిపెట్టారు.
రాత్రి మళ్లీ స్టేషన్‌కు రమ్మని చెప్పారు. ఈరోజు ఉదయం నుండి అక్రమంగా
నిర్బంధించి వేధిస్తున్నారు. ఇది కేవలం టీ.జీ వెంకటేష్‌ గారి మరియు వారి
కుమారుడు రాష్ట్ర మంత్రి టీ.జీ భరత్‌ గారి ఆదేశాలతో వారి మెప్పు పొందేందుకు
మూడవ పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గారు తన అధికారాన్ని దుర్వినియోగం
చేస్తున్నారు.
        సిపిఐ(యం) కార్యకర్త వడ్ల వెంకటేశ్వర్లును అక్రమంగా నిర్బంధించిన కర్నూల్‌
మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శేషయ్య గారి అధికార
దుర్వినియోగంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, అక్రమ
నిర్భంధంలో ఉన్న వెంకటేశ్వర్లును తక్షణమే విడుదల చేసే విదంగా ఆదేశాలు
ఇవ్వాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(కె.ప్రభాకరరెడ్డి)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

కాపీటు :
శ్రీమతి వంగలపూడి అనిత గారికి,
హోంశాఖా మాత్యులు,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org