చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై సిపిఎం స్పందన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 మే, 2025.

        చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా
27మందిని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా
ఖండిస్తున్నది.
        చర్చలకు తాము సిద్దమేనని మావోయిస్టులు పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్ర
ప్రభుత్వం, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి అమానవీయంగా
మావోయిస్టులను తుడిచిపెట్టే విధానాన్ని అనుసరించాయి. పైగా ప్రధాని,
హోంమంత్రి ప్రకటనలు ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య
స్ఫూర్తికి విరుద్ధం.
        అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు మావోయిస్టులతో చర్చలు జరిపే
విషయాన్ని పరిశీలించాలని పలు విజ్ఞప్తులు చేశాయి. మావోయిస్టు రాజకీయలతో
భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ వారితో వెంటనే చర్చలు జరపాలని, పారామిలటరీ
దాడులను ఆపివేయాలని సిపిఐ(యం) ప్రభుత్వాన్ని కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org