రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రేషన్‌ కార్డులు మంజూరు చేసి, ప్రభుత్వ పథకాలు వర్తించేట్లు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 14 మే, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
        విషయం:    రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రేషన్‌ కార్డులు మంజూరు చేసి, ప్రభుత్వ పథకాలు వర్తించేట్లు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ...
అయ్యా!
    రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ 3 లక్షల మంది ఉద్యోగులు పలు రకాల సేవలందిస్తున్నారు. గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడం లేదు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్‌మెంట్‌, వృద్దాప్య పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు వంటి పథకాలు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తించడం లేదు. చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పథకాలు వర్తించకపోవడంతో కుటుంబం పోషించడం కష్టంగా మారింది.
    గత ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించాలి. పథకాలు అన్ని వర్తించేట్లు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

-- 
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org