
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 మే, 2025.
ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కార్మికులకు
రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి
పల్నాడు జిల్లాలో జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ప్రకాశం జిల్లాకు చెందిన
నలుగురు వ్యవసాయ కార్మికులు మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ
దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం,
కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది.
ప్రమాదంలో చనిపోయినవారిలో భార్యభర్తలున్నారు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబం
రోడ్డున పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు
నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
పేదలు పనులకోసం వలసలు వెళ్ళకుండా ఉపాధి పనులు ఏడాది పొడవునా కల్పించకపోవడం
వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. వ్యవసాయంలో యంత్రాల వల్ల
కూలీలు పనులు దొరకక నానా పాట్లు పడుతున్నా రు. ప్రభుత్వం ఇప్పటికైనా కూలీలు
వలసలు పోకుండా ఉపాధి పనులు విస్తృతంగా చేపట్టాలి. ఉపాధి బకాయిలు విడుదల
చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org