షర్మిల అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 ఏప్రిల్‌, 2025.

 

షర్మిల అరెస్టుకు ఖండన

 

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్‌.షర్మిలను అడ్డుకొని, హౌస్‌ అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంఖుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం పర్యటనను పోలీసులు అడ్డుకోవటానికి నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులో దీక్ష చేస్తున్న షర్మిలపై బిజెపి కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయటాన్ని గర్హిస్తున్నది. ఇటువంటి దాడులు అప్రజాస్వామికం. 

2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసి రాష్ట్రానికి చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి తప్ప నిధులేమీ ఇవ్వలేదు. అమరావతి రాజధాని, మోడీ పర్యటన గురించి ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనను ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలి. వెంటనే గృహ నిర్బంధం నుండి షర్మిలను విడుదల చేయాలి. అమరావతి రాజధానికి ఇచ్చిన అప్పుల స్థానే గ్రాంటుగా ప్రధాన మంత్రితో ప్రకటన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి