బాణసంచా పేలుడు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఏప్రిల్‌, 2025.

బాణసంచా పేలుడు ప్రమాదంలో 

మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. వీరంతా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు నుండి పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులు. మరణించిన కార్మికునికి ఒక్కొక్కరికి కోటి రూపాయాలు నష్టపరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తోంది.

అనకాపల్లి జిల్లాలో తరుచూ పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమౌతున్నారు. బాణసంచా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి భద్రతా లోపాలు ఉన్నచోట వెంటనే చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించాలి. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి