అంబేద్కర్‌ స్మృతివనం ను ‘పిపిపి విధానం’తో నిర్వహించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరుతూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 13 ఏప్రియల్‌, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : అంబేద్కర్‌ స్మృతివనం ను ‘పిపిపి విధానం’తో నిర్వహించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరుతూ..

అయ్యా!

విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ స్మృతివనం ను పిపిపి పద్దతిలో నిర్వహించాలని, టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రకటన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఈ ఆలోచన సామాజిక స్ఫూర్తికి పూర్తి విఘాతం కల్గిస్తుంది.

విజయవాడ ప్రజలందరికీ అందుబాటులో ఉపయోగపడుతున్న పిడబ్ల్యుడి గ్రౌండ్‌ను అంబేద్కర్‌ స్మృతివనంగా తయారు చేసిన తరువాత రాష్ట్ర వ్యాపితంగా ప్రజలందరూ వచ్చి సందర్శించి ఎంతో ముగ్ధులవుతున్నారు. విజయవాడలో ఇటువంటి పర్యాటక ప్రదేశం మరొకటి లేదు. దీనిని ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసి, థియేటర్‌, ఆడిటోరియం, బుక్‌స్టాల్స్‌, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తే విజయవాడ నగరానికి తలమానికంగా ఉంటుంది. అంతేకాని ప్రభుత్వ ఆస్థిని ప్రైవేటువారికి అప్పజెప్పటమంటే స్మృతివనాన్ని పూర్తిగా కమర్షియల్‌ ప్రయోజనాలకు ఉపయోగించటమే అవుతుంది. ప్రజలకుపయోగపడే స్మృతివనాన్ని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన సరైందికాదు. వెంటనే అటువంటి ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నాను.

డా॥అంబేద్కర్‌ స్మృతివనం నిర్వహణ కోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీని అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి