పెట్రోలు, డీజిల్‌ ధర రూ.2లు తగ్గించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 ఏప్రిల్‌, 2025.

 

పెట్రోలు, డీజిల్‌ ధర రూ.2లు తగ్గించాలి

పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని రద్దు చేసి అంతర్జాతీయ ముడి చమురు ధరలకనుగుణంగా ధరలను తగ్గించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. రూ.2లు అదనపు సుంకాన్ని విధించినా ధర పెంచలేదని ప్రజలను మభ్యపరిచి, మోసపుచ్చటాన్ని నిరసిస్తున్నది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినందున అందుకనుగుణంగా ఇక్కడ కూడా పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాల్సింది పోయి ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవడం గర్హనీయం. పైగా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచలేదని ప్రచారం చేసుకోవడం ప్రజలను మభ్యపర్చడమే. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు పెంచి, తగ్గినప్పుడు ధర తగ్గించకపోవడం ప్రజలను వంచించడమే.

కావున కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్‌ సుంకాన్ని రద్దు చేసి పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే లీటరు రూ.2.లు చొప్పున తగ్గించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి