
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 ఏప్రిల్, 2025.
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించాలి - సిపిఐ(యం) డిమాండ్
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.
గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లకు, ఉజ్వల పథకం లబ్దిదారులకు రూ.50లు పెంచడం దారుణం. ఇప్పటికే దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న దశలో నిత్యావసరాలైన గ్యాస్ ధర పెంచడం ప్రజల నెత్తిన బండ వేయడమే. కావున పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ పథకం పైన కూడా భారం పడుతుంది. కాబట్టి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి