
దేశంలో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఆదివాసీల భూములే దొరికాయా అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్ ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో త్రిపుర ఎంపి జితేంద్ర చౌదరి అధ్యక్షతన ఆదివాసీి అధికార్ సంఘర్ష్ జాతీయ సమ్మేళనం జరిగింది. గిరిజన విద్యార్థుల సంబంధించి విద్య, గిరిజన యువతకి సంబంధించి ఉపాధి కల్పన, జాతీయ వనరులు ఆదివాసులవేనని, ట్రైబల్ సబ్‌ప్లాన్‌కు సంబంధించి మూడు తీర్మానాలను సదస్సు ఆమోదించింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న బృందా కారత్ మాట్లాడుతూ, దేశంలో మోడీ గద్దెనెక్కేనాటి నుండి ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ నయా ఉదారవాద విధానాలకు ముద్దుబిడ్డగా ఉన్నారని ఆయనకు దళిత, గిరిజనలు, పేదలు కనబడటం లేదని ఎద్దేవా చేశారు. ఆదివాసీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా ప్రధాని మోడీ తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని ఆరోపించారు. గిరిజనులపై దాడి చేసే బూర్జువా వర్గానికి మోడీ రక్షణ కల్పిస్తున్నారని, వారి హక్కును బుల్డోజ్ చేస్తున్నారని ఆమె విమర్శించారు. వ్యాపం కుంభంకోణం, లలిత్ గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు పార్లమెంట్లో తిరుగుతున్నారని,ఆదివాసులు మాత్రం జైల్లో మగ్గుతున్నారని విమరి్శంచారు..