భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 ఫిబ్రవరి, 2025.
తిరుపతి స్విమ్స్ మెడికల్ కాలేజీలో నాలుగు రేడియాలజిస్టుల టీచింగ్ పోస్టులకు కన్సాలిడేటెడ్ పేమెంట్ మీద వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ప్రకటన చేసింది. ఇందులో హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొనటం రాజ్యాంగ విరుద్ధం. మతాన్ని బట్టి వివక్షత చూపటం చట్ట విరుద్ధం. ఆప్రజాస్వామికం. టిటిడి ఆధ్వర్యంలో నడిచే విద్య, వైద్య సంస్థలు ప్రభుత్వా నియమ నిబంధనలకు, రాజ్యాంగ వ్యవస్థకు లోబడి పని చేస్తాయి. అవి కూడా లౌకిక సంస్థలే. ఇప్పటివరకు లేని నిబంధనలను ఉన్నట్లుండి ఒక్కసారిగా ముందుకు తేవటంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి, ఆర్ఎస్ఎస్ ల పాత్ర కనిపిస్తున్నది. మతం పేరుతో వివక్షతను ప్రదర్శించటం మంచిది కాదు. కావున వెంటనే ఈ నిబంధనను ఉహసంహరించుకొని అర్హులైన వారినీ ఉద్యోగాల్లో నియమించాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మతం పేరుతో సాగుతున్న ఈ వివక్షతా పూరితమైన నిబంధనను రద్దు చేయాలని కోరుతున్నాము .
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి