ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్‌ను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆహ్వానిస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 ఫిబ్రవరి, 2025.

 

 

1/70 చట్టాన్ని కొనసాగిస్తామని, జీవో నెంబర్‌ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్‌ను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆహ్వానిస్తున్నది. ఇదే మాదిరి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి కూడా ఒక ప్రకటన చేశారు. చట్టాన్ని సవరించాలని స్పీకర్‌ చేసిన ప్రకటనే ఈ ఆందోళన మొత్తానికి కారణమని ముఖ్యమంత్రి గుర్తించాలి. ఇది ఎవరో దుష్ప్రచారం చేస్తేనో లేదా అపోహలు సృష్టిస్తేనో వచ్చింది కాదు. గిరిజన చట్టాలను బలహీనపరిచే ఎలాంటి ప్రకటనలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జీవో నెంబర్‌ 3 ని పునరుద్ధరించి వెంటనే స్పెషల్‌ డిఎస్సి నిర్వహించి విద్యావంతులైన గిరిజన యువతలో అశాంతిని తొలగించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి