
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 జనవరి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఎన్‌టిఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల (వైద్య మిత్ర) సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..
అయ్యా!
రాష్ట్రవ్యాపితంగా దాదాపు 2400 మంది ఆరోగ్య మిత్ర (వైద్య మిత్ర)లు 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరంతా అతితక్కువ రూ.15,000లు వేతనంతో పనిచేస్తున్నారు. వీరంతా పట్టభద్రులు, పోస్టు గ్రాడ్యుయేట్స్. వీరు డి.ఈ.డీ జూనియర్ అసిస్టెంట్ కేడర్లతో సమానమైన పనులు నిర్వహిస్తున్నారు. అయినా ఔట్‌సోర్సింగ్‌లో క్లాస్ 4 ఉద్యోగులకు చెల్లించే వేతనాలను (రూ.150,000లు) మాత్రమే చెల్లిస్తున్నారు. దీనిపై ఆరోగ్య మిత్రల సంఘాలతో మీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా నేటికీ సమస్యలు పరిష్కరించబడలేదు.
పై అంశాలను మీరు పరిశీలించి వైద్య మిత్రలను కాంట్రాక్టు పద్దతిలోకి మార్చి, చేస్తున్న పనిని బట్టి కేటగిరి 1గా మార్చి వేతనాలను పెంచమని, హెచ్.ఆర్.పాలసీ వర్తింపజేయమని, వైద్య మిత్రులను కొనసాగించి, మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతున్నాను.
సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ....
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి