గణతంత్ర దినోత్సవం రోజున దళిత ఉద్యమ నాయకులపై పోలీసుల నిర్బంధానికి ఖండన..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 జనవరి, 2025.

 

గణతంత్ర దినోత్సవం రోజున దళిత ఉద్యమ నాయకులపై 

పోలీసుల నిర్బంధానికి ఖండన..

అంబేద్కర్‌ కి నివాళులర్పించి రాజ్యాంగ పీఠిక చదువుతామంటే పర్మిషన్‌ లేదని నిర్భంధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రిని గృహ నిర్భంధంలో పెట్టారు. నగర నాయకులు నటరాజ్‌, క్రాంతిబాబులను అరెస్టు చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పీఠిక చదవండి అని ప్రభుత్వాలే అందరికి పిలుపు ఇస్తే విజయవాడ నగర పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేసి, పోలీస్‌ స్టేషన్‌ తరలించడం దుర్మార్గం.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పిస్తామంటే నిర్బందించడం సిగ్గు చేటు. ఇది అంబేద్కర్‌ను, భారత రాజ్యాంగాన్ని  అవమానించడమే. ప్రజాస్వామిక హక్కుల్ని గౌరవిస్తామని చంద్రబాబు కొత్త ప్రభుత్వం ప్రకటించి ఆరునెలలు కాకుండానే దాన్ని హరించడం మాట తప్పడమే. చట్ట విరుద్ధంగా అరెస్టులు చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాము. 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి