రాష్ట్ర మహాసభల సందర్భంగా 5 పతాక యాత్రలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 జనవరి, 2025.

 

రాష్ట్ర మహాసభల సందర్భంగా 5 పతాక యాత్రలు

సిపిఐ(యం) రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న 5 ప్రధాన సమస్యలపై ఐదుచోట్ల నుండి పతాక యాత్రలు ప్రారంభమై జనవరి 31 రాత్రికి నెల్లూరుకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 1,2,3 తేదీలలో 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో సీతారాం ఏచూరి నగర్‌లో జరుగుతాయి.

32 మంది ప్రాణత్యాగాలతో  ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం నుండి, పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం కోసం కూనవరం మండలం నుండి, కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే నిర్మాణం చేయాలని జమ్మలమడుగు నుండి, సెకీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలని నంద్యాల నుండి, రాజధాని అమరావతిని చట్టబద్ధంచేసి కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని, ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాడేపల్లి నుండి పతాక యాత్రలు ప్రారంభమవుతాయి.

విశాఖపట్నం నుండి జాతా 28వ తేదీన ప్రారంభమై అనకాపల్లి, రాజమండ్రి ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు మీదుగా 31వ తేదీన నెల్లూరుకు చేరుకుంటుంది. కూనవరం మండలం బొజ్జరాయి గూడెంలో జాతా 29వ తేదీన ప్రారంభమై జంగారెడ్డిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా 31వ తేదీన నెల్లూరుకు చేరుకుంటుంది. జమ్మలమడుగు నుండి జాతా 30వ తేదీన ప్రారంభించి పులివెందుల, కడప, సిద్దవటం, బద్వేలు మీదుగా 31వ తేదీన నెల్లూరు చేరుకుంటుంది. నంద్యాలలో 30వ తేదీన ప్రారంభించి ఆళ్ళగడ్డ, ప్రొద్దుటూరు, ఆత్మకూరు, నెల్లూరుకు ఫిబ్రవరి 1వ తేదీన చేరుకుంటుంది. తాడేపల్లిలో 30వ తేదీన బయలుదేరి గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా నెల్లూరుకు ఫిబ్రవరి 1న చేరుకుంటుంది.

జాతా దారిపొడవునా ప్రజలు పతాక యాత్రలకు స్వాగతం పలకాలని, ఆయా ప్రాంతాలలో జరిగే సభలలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి