రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి రూ.500లు అదనంగా బోనస్‌ ప్రకటించాలి రాష్ట్రంలో వరి విత్తనాల పరిశోధనపై కేంద్రీకరించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 జనవరి, 2025.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి రూ.500లు అదనంగా బోనస్‌ ప్రకటించాలి 

రాష్ట్రంలో వరి విత్తనాల పరిశోధనపై కేంద్రీకరించాలి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకు రూ.500లు బోనస్‌ ప్రకటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. నేడు మార్కెట్‌లో కేంద్ర ప్రభుత్వ మద్దతుకన్నా తక్కువ ధరకు కొనడంతో రైతులు నష్టపోతున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, డీజిల్‌ తదితర ఇన్‌పుట్స్‌ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరగడంతో రైతులు అష్టకష్టాల పాలవుతున్నారు. మరోవైపు అకాల అధిక వర్షాలు తుఫాన్‌ లాంటి ప్రకృతి వైపరిత్యాలు రైతులను, కౌలు రైతులను వెంటాడుతూనే పండిరచిన పంటకు రక్షణ లేకుండా అయిపోయింది. ఇన్‌పుట్స్‌ ధరలు పెరగటం ప్రభుత్వం నుండి అవసరమైన పరపతి లభించకపోవడం, మద్దతు ధరలు సరిపోకపోవడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగి వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులు సన్నాచిన్న కారు రైతులు అప్పుల, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. వీటన్నిటి వల్ల పంటలకు స్వామినాథన్‌ కమిటీ సిఫారసు ప్రకారం మద్దతు ధరలు ఇవ్వాలని, చట్టం చేయాలని, ఢల్లీి కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూనే ఉంది. కేరళ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా క్వింటాకు వరికి రూ.800లు, మన ప్రక్కనున్న తెలంగాణ ప్రభుత్వం క్వింటాకు రూ.500లు, చతీస్‌ఘడ్‌్‌ ప్రభుత్వం రూ.400లు బోనస్‌గా ప్రకటించి అక్కడ రైతులని ఆదుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో రైతులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు అందిస్తామన్నారు. కానీ నేటికి అమల్లోకి రాలేదు. కాబట్టి మన ప్రక్క రాష్ట్రాలు ఇస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధరకు క్వింటాకు అదన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి ఆధారంగా రూ.500లు ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

నూతన వరి విత్తనాల పరిశోధనలపై  కేంద్రీకరించాలి

ప్రకృతిలో వాతావరణ మార్పులు వేగంగా తీవ్రంగా మారుతున్నాయి. వీటి ప్రభావం వ్యవసాయంపై ఎక్కువగా పడుతుంది. సీజన్లు కూడా కొంత మారుతున్నాయి. ఈ వాతావరణ మార్పులను తట్టుకునేటట్లు నూతన విత్తనాలు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుండి వరిలో కొత్త విత్తనాలు ఆవిష్కరణ జరగలేదు. ఫలితంగా పునరుత్పత్తి శక్తి కూడా తగ్గిపోతుంది. దీనితో దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి కూడా చేయలేకపోయే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కునారం (కేఎన్‌ఎమ్‌ 16 38) పేరుతో 120 ` 125 రోజులకు పంట చేతికి వచ్చే నూతన విత్తనాలు విడుదల చేశారు. ఉత్పత్తి కూడా అధికంగా వస్తుంది. మార్కెట్లో కూడా మంచి రేటుకు రైతులు అమ్ముకుంటున్నారు. మన రాష్ట్రంలో నూతన విత్తనాలపై, ఇతర వ్యవసాయ పరిశోధనలు కుంటుపడ్డాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో నూతన విత్తనాలు ఆవిష్కరణ లేకపోవడం పరిశోధనలు కుంటుపడడంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపించాయి. కావున వ్యవసాయ రంగంలో పరిశోధనలు పెంచాలని నూతన వరి ఇతర విత్తనాల ఆవిష్కరణపై దృష్టి సారించాలని, అధిక దిగుబడి కలిగిన, ప్రజలకు అవసరమైన, అధిక రేటు వచ్చే విత్తనాల్ని రైతులకు అందుబాటులో తేవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. వ్యవసాయ పరిశోధన, విస్తరణకు అవసరమైన నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నది. 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి