పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 జనవరి, 2025.

 

పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎప్పుడో నిర్ణయించిన పాత అమౌంట్‌ను కొన్ని ప్రాంతాలలో నిర్వాసితుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బ్యాంకులో డబ్బులు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

2015లో నాటి టిడిపి ప్రభుత్వం 6.86 లక్షలు ప్రకటించింది. ఆ తరువాత 2022లో సిపిఐ(యం), ప్రజల ఆందోళన తర్వాత జగన్‌ ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. కానీ గత, ప్రస్తుత ప్రభుత్వాలు పెంచిన దాన్ని అమలు చేయకుండా అన్యాయం చేశాయి.

అలాగే 41.75 మీటర్ల వద్ద ఆశాస్త్రీయంగా నిర్ణయించిన కాంటూరు లెక్కల ప్రకారం కొద్ది గ్రామాలకే పరిహారం ఇవ్వడాన్ని కూడా సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. 2021-22 వరదల ప్రాతిపదికగా కాంటూరు లెక్కలను తాజా పరచి నేటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 2013 భూసేకరణ చట్టం, ఆదివాసీ హక్కుల చట్టాల ప్రకారం పెరిగిన ధరలకనుగుణంగా పరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించిన తరువాతే డ్యాం పనులు చేపట్టాలని, ఈలోగా ఆయా ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి