దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చవద్దు సంఘ్ కుట్రలపై సిపిఎం హెచ్చరిక

(ఈరోజు (03 జనవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
దేవాలయాలను
రాజకీయ కేంద్రాలుగా మార్చవద్దు
సంఘ్  కుట్రలపై సిపిఎం హెచ్చరిక
సామాజిక న్యాయాన్ని దెబ్బతీసేందుకే పరివారం ప్రయత్నం
రాష్ట్రంలో దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చేందుకు సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నం చేస్తోందని, వాటిపై ఆధిపత్యం కోసం చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తాయని, సమాజంలో చీలికలు తెస్తాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావుతో కలిసి ఆయన మాట్లాడారు. దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా, పండుగలను రాజకీయ ప్రచార కార్యక్రమాలుగా మారుస్తూ ప్రజల మధ్య చీలకలు తెచ్చే విధంగా  వ్యవహారం నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై ప్రభుత్వం నియంత్రణ వద్దనే పేరుతో చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం పూర్తిగా ప్రజావ్యతిరేకమని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్‌లో దేవాలయాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని, దీనికి చట్టం కూడా చేశారని అన్నారు. ఇక్కడ మాత్రం ఫ్రభుత్వ ఆధీనంలో ఉండకూదంటే ఎలాగని ప్రశ్నించారు. అయోధ్య రామమందిరం ట్రస్టు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉందని, ఆ ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులున్నారని కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టుతోనే నడుస్తోందని అన్నారు. దేవాలయాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వ నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వమే దేవాలయాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రభుత్వం నియమించిన ట్రస్టుతోనే నడుస్తోందని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. విశ్వహిందూ పరిషత్‌ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం దేవాలయాలను కబ్జా చేసేందుకేనని అన్నారు. అల్లకల్లోలం, భయాందోళనలు సృష్టించి ప్రజలు తప్పుదారి పట్టించి దేవాలయాలపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి చర్యలను అందరూ అడ్డుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాల నిర్వహణ ఉంటుందని, ప్రభుత్వం లౌకిక వ్యవహారాలను మాత్రమే చూస్తుందని అన్నారు. ప్రభుత్వ నియంత్రణ వద్దంటే ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం కూడా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశారని, దేవాలయాల్లో రాజకీయాలు వద్దనపప్పుడు మోడీ చేత దేవాలయాన్ని ఎందుకు ప్రారంభించారని, అయోధ్య దేవస్థానాన్ని ఎందుకు ప్రారంభించారో చెప్పాలని ప్రశ్నించారు. వాటిని కూడా మహంతులు, మఠాధిపతులతో ఎందుకు ప్రారంభించలేదని అన్నారు. మరోవైపు దేవాలయ సంస్థల్లో అన్యమతస్తులు ఉండకూదని, బయట వ్యాపారాలు చేయకూడదని చెబుతున్నారని మరి టిటిడిలో లడ్డూ అవినీతికి పాల్పడిరది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. కొబ్బరి, అరటికాయలు పండిరచడం, ధూపదీప నైవేధ్యానికి అవసరమైన వస్తువుల తయారీ అన్నీ ఒకే మతం వారు చేస్తారా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. తిరుపతిలో దేవస్థానం ఆధ్వర్యాన ఆస్పత్రులు ఉన్నాయని, వాటిల్లో కూడా ఒక మతానికి చెందిన వారినే డాక్టర్లుగా నియమిస్తారా ? వారికే చికిత్సలు అందిస్తారా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దేవాలయాలు, మసీదులు పక్కపక్కనే ఉన్నాయని, సంఫ్‌ు పరివార్‌ చెప్పేది వింటే మరొక మతం వారు పూజలు చేయడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందని ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. వీధివీధిన దేవాలయాలు ఉన్నాయని, విహెచ్‌పి  వారు చెబుతున్న ప్రకారం వేరేమతం వారు వ్యాపారాలు చేయకూడదని అన్నారు. విహెచ్‌పి. ఆర్‌ఎస్‌ఎస్‌కు దేవాలయాలపై కంట్రోల్‌ వస్తే వారికి హద్దే ఉండదని, మతసామరస్యం అనే మాట లేకుండా చేస్తారని, ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో అటువంటి పద్ధతి మంచిది కాదని అన్నారు. మతోన్మాదాన్ని పెంచే ఇలాంటి చర్యలను పూర్తిగా వ్యతిరేకించాలని ఆయన డిమాండు చేశారు. రాబోయే రోజుల్లో ఎపిలో అధికారంలోకి రావడం కోసం సంఫ్‌ు పరివార్‌ బృందం ఇలాంటి చేష్టలకు దిగుతోందని అన్నారు. 2000 సంవత్సరంలో శ్వేత కార్యక్రమం పేరుతో దళితులకు శిక్షణ ఇచ్చి దేవాలయాల్లో పూజారులుగా పెట్టారని, అనంతరం ఎత్తేశారని అన్నారు. దేవాలయాలపై ప్రభుత్వం నియంత్రణ లేకపోతే 12000 మంది పురోహితులకు అన్యాయం జరుగుతుందని, వారంతా జీతాల్లేక వీధినపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం దూపదీప నైవేధ్యాలు, గౌరవ భృతిపేరుతో ఒక్కోక్కరికి ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తోందని, రేపు వీరందరికీ నిలిపేస్తే పురోహితుల కుటుంబాలు ఎలా నడవాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. కులం గడపలోపలే అంటూ సంఫ్‌ు బృందం చేసే ప్రచారం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.  కులం ఒక సామాజిక సమస్యని కుల వ్యవస్థను పటిష్టం చేసి కాపాడేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ ప్రచారం చేస్తోందని అన్నారు. వీరు చెప్పేవి ఆచరణలోకి వస్తే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు రిజర్వేషన్లు లేకుండా పోతాయని, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. కుల వివక్ష అంటరానితనం పెరగఱుతుఉందన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బిజెపి కుతంత్రం చేస్తోందనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
క్రీడాకారులకు అభినందనలు
జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన క్రీడాకారులకు సిపిఎం రాష్ట్ర కమిటీ తరుపున అభినందనలు తెలిపారు. జ్యోతి, దీప్తి అర్జున అవార్డులకు ఎంపికవడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. మనూబాకర్‌కు నామినేషన్‌ చేయకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ఇవ్వాల్సి వచ్చిందని, అది అమెకు దక్కిన గౌరవమని అన్నారు. అలాగే గుకేష్‌కూ అభినందనలు తెలిపారు.
= = = =