భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 డిసెంబర్, 2024.
అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై సిపిఐ(యం) ఖండన
రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ను కించపరిచేలా, దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.
భారత రాజ్యాంగం రూపశిల్పి అయిన డాక్టర్ అంబేద్కర్ గురించి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. దీనితో ఆయన మనువాద దృక్పథాన్ని బయటపెట్టారు.
అమిత్ షాకు హోంమంత్రిగా కొనసాగే హక్కు లేదని సిపిఐ(యం) భావిస్తున్నది. ఇటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రజాతంత్రవాదులు, మేధావులు, లౌకిక, సామాజిక వాదులు సంఘాలు నిరసనలు తెలియజేయాల్సిందిగా సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org