
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
(1)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 13 డిసెంబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : గిరిజన సంక్షేమ గురుకులాలలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్టులోకి మార్చాలని, వేతనాలు పెంచాలని కోరుతూ...
అయ్యా!
రాష్ట్ర వ్యాప్తంగా 161 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1653 మంది ఔట్ సోర్సింగ్ టీచర్లు దాదాపు 10సం॥లుగా సేవలందిస్తున్నారు. వీరంతా ఇతర ఔట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కన్నా తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగంలోని ఏ ఇతర విభాగంలోనూ ఔట్ సోర్సింగ్ పద్దతిపై బోధన సిబ్బంది లేరు. కానీ గిరిజన సంక్షేమ గురుకులాలల్లోనే ఔట్ సోర్సింగ్ విధానం గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
తమను కాంట్రాక్టు పద్దతిలోకి మార్చాలని, 2022 పిఆర్సీ ప్రకారం మినిమం టైంస్కేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఔట్ సోర్సింగ్ టీచర్లు నవంబరు 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. కావున మీరు జోక్యం చేసుకుని, పై సమస్యలు పరిష్కరించేలా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయమని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి