
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 డిసెంబర్, 2024.
అంగన్‌వాడీ కేంద్రాల్లో మైనారిటీ మతపరమైన లెక్కల సేకరణ ఆపండి
- సిపిఐ(యం) డిమాండ్
ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల పిల్లల లెక్కలను 2014 నుండి 2025 వరకు పుట్టిన వారి వివరాలు, అందులో అంగన్వాడీ కేంద్రాలలో చేరిన వారి నిష్పత్తి సేకరించి 24 గంటల్లో పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఐసిడిఎస్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ వెనుక ఉద్దేశం ఏమిటో, ఏ లక్ష్యం కోసం సేకరిస్తున్నారో చెప్పకుండా గుట్టుగా వివరాలు పంపమని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇలాంటి వివరాలను బహిరంగంగా ప్రకటించి, పారదర్శకంగా నిర్వహించాలి. ఒక వైపు కుల గణన చేయాలని సిపిఎం సహా అనేక ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా తిరస్కరిస్తున్న ప్రభుత్వం మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా రాజ్యాంగ విరుద్దంగా మత పరమైన వివరాలు సేకరించడం వెనుక ఎజెండా ఏమిటో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. తక్షణం ఈ లెక్కల సేకరణ ఆపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org