
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 20 నవంబర్, 2024.
విశాఖ నగరంలో న్యాయ విద్యార్థినిని ప్రేమ పేరుతో నయవంచన చేసి దారుణంగా అత్యాచారం చేసిన లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈ ఘటన నాగరిక ప్రపంచాన్ని సిగ్గుతో తలదించుకునేట్లు చేసింది. ఒక లా విద్యార్థిని ఈ అమానుషత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆత్మహత్యకు సిద్దపడిరదంటే ప్రభుత్వ, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం లేని స్థితి కనిపిస్తున్నది. తిరుపతి జిల్లాలో మూడేళ్ళ చిన్నారిని చిదిమేసిన ఘటన మరువకముందే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలు, పిల్లలపై దాడులు, అత్యాచార ఘటనలు పెరుగుతున్నా పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం గర్హనీయం. నిందితులకు సరైన శిక్షలు పడకపోవడం, జాప్యం జరగడం వలన మరింత పెట్రేగిపోతున్నారు.
ఈ ఘటనలో బాధిత విద్యార్థినికి, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించే చర్యలు తీసుకోవాలి. అఘాయిత్యం చేసిన దుర్మార్గుల్ని శిక్షించి సత్వర న్యాయం చేసే విధంగా ప్రతేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పెట్టాలి.
యువతలో ఇలాంటి ఘటనలపై సామాజిక స్పృహను పెంచేందుకు రాష్ట్రవ్యాపితంగా ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టాలని సిపియం డిమాండ్ చేస్తున్నది. మహిళలు, విద్యార్థులు సంఘటితపడి ఇలాంటి ఆకృత్యాలు పునరావృతం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి