
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ
కమీషన్‌కు నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం.
- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 11 నవంబర్, 2024.
సెక్రెటరీ గారికి,
ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ,
కర్నూలు.
ఆర్యా,
విషయం: 2023-24 సంవత్సరం FPPCA సంబంధించి తూర్పు, దక్షిణ, మధ్య విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ఓ పి నెంబర్. 69,70,71 లపై అభ్యంతరాలు తెలుపుట గురించి...
04-11-24 న ప్రకటించిన బహిరంగ నోటీసు ద్వారా 2023- 24 ఖీూూజA సంబంధించిన ప్రతిపాదనలపై ఈనెల 19వ తేదీ లోపు అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియచేయాలని కోరారు. 11,826 కోట్ల రూపాయల భారంపడే ఈ ట్రూఅప్ చార్జీలు ప్రజలు మోయలేనిది. దీనిపై పూర్తి సమాచారము, పట్టికలు పరిశీలించి, విశ్లేషించి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుపుటకు 15 రోజుల సమయం ఏ మాత్రం చాలదు. గత నెలలో 2022- 23 సంవత్సరానికి సంబంధించిన 8,114 కోట్ల రూపాయల ఖీూూజA ప్రతిపాదనలపై రిటైర్ అవుతున్న చైర్మన్ గారు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి, బహిరంగ విచారణ కూడా తక్కువ సమయంలోనే జరిపి 6,072 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై మోపిన సందర్భంలోనూ తగు సమయం లేకపోవడం, భారం పైన మా అభ్యంతరాలు తెలిపాము.
ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం మోపబోమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2023- 24 సంవత్సరం ట్రూ అప్ చార్జీల ప్రతిపాదనలు ప్రజలకు ఆమోదయోగ్యంగా లేవు. దీనిపై మా పార్టీ మరియు ఇతర సంఘాలు, సాధారణ ప్రజలు అభ్యంతరాలు, అభిప్రాయాలు సమగ్రంగా తెలియజేయుటకు మరొక 15 రోజులు పాటు సమయం పొడిగించాలి. కనీసం నవంబర్ నెల ఆఖరి వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించాలి. గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి