అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో అక్రమంగా లే-ఆఫ్‌ ప్రకటించిన అభిజిత్‌ ఫెర్రోటెక్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని కంపెనీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 27 అక్టోబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో  అక్రమంగా లే-ఆఫ్‌ ప్రకటించిన అభిజిత్‌ ఫెర్రోటెక్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని కంపెనీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ...

అయ్యా, 

అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని అభిజిత్‌ ఫెర్రోటెక్‌ లిమిటెడ్‌ యాజమాన్యం చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా లే`ఆఫ్‌ ప్రకటించి తేది:13`10`2024 నుండి కంపెనీ మూసేసింది. కనీసం కార్మికులకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది చట్ట వ్యతిరేకం. నేటికీ 15 రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. కార్మిక చట్టాల            ఉల్లంఘించి అక్రమంగా లే`ఆఫ్‌ ప్రకటించిన అభిజిత్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకొని కంపెనీని తెరిపించ కార్మికులను ఆదుకోవాలని సిపిఎం కోరుతుంది. ద్దాలు!

అభిజిత్‌ కంపెనీలో వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. నేడు కంపెనీని మూసివేయడంతో వీరి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఈ కంపెనీలో యాజమాన్యం ఏనాడు కార్మిక చట్టాలుగాని, కనీస వేతనాలుగాని అమలు చేయడం లేదు. ఎస్‌.ఇ.జడ్‌ లో పక్కనే ఉన్న మైతాన్‌, సుందరం, లలితా ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీల కంటే అభిజిత్‌లో కార్మికుల జీతాలు తక్కువే ఉన్నాయి. గతంలో ఆందోళన చేసినప్పుడు డస్ట్‌ అలవెన్స్‌, హీట్‌ అలవెన్స్‌ ఇస్తామని అంగీకరించి యాజమాన్యం మాట తప్పింది. జీతాలు ప్రతినెలా సక్రమంగా ఇవ్వడం లేదు. జీతాలు 5వ తేదీకి ఇవ్వాల్సిన జీతాలు 24 వ తేదీ వరకు ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం దసరాకి బోనస్‌ కూడా ఇవ్వలేదు. అక్రమంగా లేఆఫ్‌ ప్రకటించి కార్మికులను రోడ్డున పడేసిన యాజమాన్యంపై చర్య తీసుకోవాలి.

  ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికమంది ఎస్‌ఇజెడ్‌ కోసం తమ భూములు త్యాగం చేసి నిర్వాసితులుగా మారిన వారే. తమ ప్రాంతంలో కంపెనీలు వస్తే తమకి, తమ పిల్లలకి ఉపాధి దొరుకుతుందని భావించిన నిర్వాసితుల జీవితాలతో అభిజిత్‌ మాజమాన్యం చెలగాటం ఆడుతోంది. కరోనా కాలంలో  డ్యూటీకి రాలేని  పరిస్థితుల్లో డ్యూటీలు వచ్చి తీరాలని యాజమాన్యం బలవంతం చేసి మరి పని చేయించుకుంది. అనేక ఇబ్బందులు పడుతూ కరోనాలో కూడా కార్మికులంతా కంపెనీకోసం పని చేశారు. కోట్ల రూపాయల లాభాలు గడిరచినప్పుడు మాట్లాడని యాజమాన్యం, ఇప్పుడు నష్టాల పేరు చెప్పి లేఆఫ్‌ ప్రకటించడం అత్యంత దుర్మార్గం.

కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మూసివేసిన అభిజిత్‌ ఫెర్రోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీని తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాను. 

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి